POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 1:15 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం రూరల్ మండలంలో పోలీస్ అధికారుల అరాచకాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 03 2026: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఒక దళిత యువకుడ్ని తీసుకువచ్చి నువ్వు దొంగతనం కేసు ఒప్పుకోవాలి లేదంటే నిన్ను మీ ఇద్దరు పిల్లల్ని నీ భార్యని కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తాము అని రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ దళిత యువకుడ్ని భయభ్రాంతులకు గురి చేస్తూ 15 రోజుల నుంచి తన కారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని నువ్వు రాత్రిపూట కార్లో తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నావని ఎటువంటి ఆధారాలు లేకుండా తనను మానసికంగా హింసిస్తూ యువకుని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఒప్పుకోవాలి లేదంటే నిన్ను ఎన్కౌంటర్ చేస్తామని ఎస్సై బెదిరిస్తున్నట్టు బొగట్ట దళిత యువకుడివి నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను నిన్ను కాపాడటానికి ఎవరు వస్తారో చూస్తామంటూ ఎస్ఐ బెదిరిస్తున్నారు అని బాధితుడు వాపోయారు సార్ నాకు ఏ పాపం తెలియదు నేను అట్లాంటి తప్పు చేసే వాడిని కాదు నేను ఎంసీఏ చదువుకున్నాను ఏదో బతకడానికి కిరాణా షాప్ పెట్టుకున్నాను నన్ను వదిలేయండి సార్ అని బాధితుడు పలుమార్లు ప్రాదేయపడ్డ కూడా ఎస్సై వదిలిపెట్టకుండా అతని మీద దొంగ కేసులు బనాయించాలని దొంగ కేసులు ఎఫ్ఐఆర్ చేయాలని చూస్తున్నాడు అసలు రోజూ దొంగతనాలు చేసి బయట తిరిగే దొంగల్ని పట్టుకోకుండా ఇలాంటి అమాయకులను పోలీసు వారు బలి చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పోలీస్ వారికి వదిలేస్తున్నాము. బాధితుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ నేను నా భార్య నా కుటుంబ సభ్యులకు నేనే ఆధారం సార్ నన్ను వదిలేయండి సార్ నేను తప్పుడు మనిషిని కాదు త తప్పుడు పనులు చేసే వాడిని కాదు సార్ అన్నా కూడా వదిలిపెట్టకుండా 20 రోజుల నుంచి రోజు పోలీస్ స్టేషన్ పిలుస్తూ అతనిని మానసికంగా వేధిస్తూ బెదిరిస్తున్నారని బాధితుడు తెలియజేశాడు.  తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి జరగటం అనే ఈ సూచనయం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్ననే ఒక దళిత యువకుడు సిఐ నన్ను హింసిస్తున్నాడు బెదిరిస్తున్నాడు. బాధపెడుతున్నాడని వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమధ్య ఇలాంటివి ఎందుకు ఎస్సీ దళితుల మీదనే జరుగుతున్నాయి ఓసీల మీద జరగవా ఓసీలకు ఎవరో ఒకరు రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయి. కాబట్టి వాళ్ళని పోలీసు వారు ఏమీ అనరా అంటే దళితులు అంటే అంత చులకన దీనిమీద ఖమ్మం జిల్లా సీపీ గాని ఖమ్మం రూరల్ ఏసీపీ గాని దృష్టి పెట్టి ఇలా ఎస్సీ మాదిగ కులానికి చెందిన దళితుల మీద తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్న ఎస్ఐలను పోలీస్ అధికారులను వెంటనే ఖమ్మం సీపీ ఆఫీస్ కి అటాచ్ చేయాలని కుల సంఘాల నాయకులు కోరుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి దళిత యువకులను బాగా చదువుకున్న వారిని ఊర్లో రాజకీయ కక్షలు నేపథ్యంగా రాజకీయ నాయకులు చెప్పే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేసే పోలీసు వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపిని బాధితులు కోరుకుంటున్నారు. కొస మెరుపు ఏంటంటే దళితులకు ఒక న్యాయం మిగతా కులాలకు న్యాయమా పోలీస్ స్టేషన్లో పలాని కులానికి అయితేనే మేము న్యాయం చేస్తాము. ఎస్సీ కులానికి చెందిన వారి కైతే మేము ఎన్కౌంటర్ చేస్తాము లాక్ అప్ డెత్ లు చేస్తాము అని పోలీస్ స్టేషన్లో బోర్డులు తగిలిస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే మేము దళితుల పక్షపాతము దళితుల కోసమే పని చేస్తున్నాము అని మీటింగులో చెప్పటం ఆనవాయితీ అయిపోయింది.