ప్రశాంతంగా ముగిసిన మహాగణేష్ నిమజ్జన కార్యక్రమం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 25 2026: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. మహాగణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది.
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగింపు
ఇదిలా ఉండగా బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుంది. బాలాపూర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర చార్మినార్ వైపు కొనసాగుతోంది. శోభాయాత్ర సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలు చేపట్టారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండనున్నారు.