POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 9:47 pm Posted by : POLITICAL POWER

గంగారంలో శుక్రవారం మెగా ఉచిత వైద్య శిబిరం 

దాసరి మధుమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా

న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ

వివిధ వ్యాధులకు పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ

పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి మధుమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రేపు (శుక్రవారం) మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జలగం నగర్ చెరువు సమీపంలో నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. శిబిరంలో చిన్నపిల్లల వైద్యులు, ఎండీ వైద్యులు, చెవి-ముక్కు-గొంతు (ఈఎన్‌టీ) నిపుణులు, పెద్దల వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు. వివిధ వ్యాధులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గంగారం గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.