దాసరి మధు మోహన్ రెడ్డి చొరవతో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు
రెండు చోట్ల బ్లాక్ అయిన త్రాగునీటి పైప్‌లైన్ గుర్తింపు
కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా పునరుద్ధరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ , సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఎ హరిబాబు జూన్ 27 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామం తూర్పు బజారులో రెండు చోట్ల తాగునీటి పైప్‌లైన్ బ్లాక్ కావడంతో కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడింది. పైప్‌లైన్ ఎక్కడ బ్లాక్ అయిందో గుర్తించి, ఈ రోజు గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి మధు మోహన్ రెడ్డి చొరవతో రెండు చోట్ల కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. దీంతో తాగునీటి సరఫరా పునరుద్ధరించబడగా, తూర్పు బజారు కాలనీవాసులు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం పొంది ఆనందం వ్యక్తం చేశారు.