POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 10:12 pm Posted by : POLITICAL POWER

గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

వైద్యుల సేవలను కొనియాడిన వైద్య సిబ్బంది

డాక్టర్ అవినాష్, డాక్టర్ ఎండి అశ్వక్‌లను సత్కరించిన వైద్య బృందం.

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 01 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని భారతదేశ ప్రముఖ వైద్యులు, స్వాతంత్య్ర సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 1న నిర్వహిస్తారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను భారత అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ లభించింది. ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత: 1. ప్రాణాలను కాపాడటంలో, వ్యాధులను నయం చేయడంలో వైద్యులు పడే శ్రమ, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపే రోజు. 2. వైద్యుల ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసి, వారి పట్ల గౌరవాన్ని పెంపొందించే రోజు. 3. భారత ప్రభుత్వం 1991 నుంచి ప్రతి సంవత్సరం జూలై 1న అధికారికంగా డాక్టర్స్ డేను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గంగారం పీహెచ్‌సీ వైద్య బృందం డాక్టర్ అవినాష్, డాక్టర్ ఎండి అశ్వక్‌లను ఘనంగా సత్కరించి, వారి సేవలను కొనియాడింది. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఓ వెంకటేశ్వరరావు, హెచ్‌వీలు శారదారాణి, విజయకుమారి, ఫార్మసిస్ట్ సత్యనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మీనరసింహారావు, స్టాఫ్ నర్స్ సుకన్య, ఏఎన్‌ఎంలు పద్మావతి, సునీత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.