POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 12:09 pm Posted by : POLITICAL POWER

గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల గండి గండి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు.

గ్రామస్థుల ఆహ్వానం మేరకు పార్కలగండి గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడిని స్థానిక సర్పంచ్  కోమరం సుశీల తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు కాకా శివశంకర్ ప్రసాద్ అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయనను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పట్వారిగూడెం గ్రామానికి చెందిన ముంగమురుగు సీతారాం కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయనను కూడా పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో సున్నం నరేంద్ర, ఉదయ్ కుమార్, పద్దం అశోక్, ఊకే నరసింహారావు, పార్కలగూడెం యువకులు తదితరులు పాల్గొన్నారు.