గణపయ్య రాకకు.. ఘనంగా ఏర్పాట్లు!
గ్రామగ్రామాన మండపాల ముస్తాబు.. భక్తుల మాలధారణతో ఆధ్యాత్మిక సందడి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 14 2026: వినాయక చవితి వేడుకలకు అశ్వారావుపేట మండలంలో సందడి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణం వరకు గణనాథుని ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం ప్రారంభం కానున్న ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మండపాలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వినాయక విగ్రహాలను మండపాలకు తరలించారు....