POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 6:11 pm Posted by : POLITICAL POWER

గణేష్ ఉత్సవ కమిటీ వారు నిబంధనలు పాటిస్తూ పూజలు త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను తరలించాలి

– జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎం 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్. 26. 2026.గణేష్ ఉత్సవ కమిటీ వారు నిబంధనలు పాటిస్తూపూజలుత్వరగాముగించివెలుతురుఉండగానేవిగ్రహాలనునిమజ్జనానికి తరలించాలని జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి అన్నారు. శుక్రవారం ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్  గణేష్ నిమజ్జనం చివరి రోజు డీఎస్పీ తో కలిసి నల్లచెరువు నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూటౌన్ ఎస్సై. హరిప్రసాద్, రూరల్ ఎస్సై.రుషికేశ్,పోలీసుసిబ్బందికిఎలాంటిఅవాంఛనీయసంఘటనలు జరగకుండా భక్తులకు పటిష్ట భద్రత కల్పిస్తూనిమజ్జనాన్నిప్రశాంతంగానిర్వహించాలనిసూచించారు.ఇన్నిరోజులుగాపటిష్టమైనబందోబస్తునిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందిస్తూ, చివరి రోజుకూడాఅదేఅప్రమత్తతతోవిధులునిర్వహించాలని ఆదేశించారు.ఉత్సవ కమిటీలునిబంధనలుపాటిస్తూ, పూజలు త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను తరలించాలని, డీజేలు, బాణాసంచా విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు.
నిమజ్జన ప్రాంతంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత సిబ్బంది, కాంట్రాక్టర్‌కు సూచిస్తూ, మత సామరస్యంతోనిమజ్జనకార్యక్రమాన్నివిజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ కోరారు.