POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 5:23 am Posted by : POLITICAL POWER

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో సెప్టెంబర్ 21 2026: సికింద్రాబాద్ లాలాపేట్: శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లాలాపేట్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను తెలంగాణ రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షులు, వనపర్తి నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు సామాజిక స్ఫూర్తిని చాటుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఐపీసీ సిఎస్&పిఆర్ డొమైన్ హెడ్ సందీప్ భూషణ్, ఫైనాన్షియల్ డొమైన్ హెడ్ వై. సంతోష్, ఎంఎస్ఎంఈ డొమైన్ హెడ్ శశాంక్ పసుపులేటి, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు నరైన్ రాజా, అడ్వకేట్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.