*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ రోడ్ నంబర్ 2లో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో చల్లా కృష్ణన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినాయక మండపాన్ని సందర్శించి లంబోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డివిజన్ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.
🙏 అనంతరం మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని చల్లా కృష్ణన్న తన చేతుల మీదుగా ప్రారంభించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు