POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 4:58 pm Posted by : POLITICAL POWER

గరీబ్ నగర్ 23వ వార్డులో 360 ఓట్లతో సీపీఎం అభ్యర్థి రణధీర్ ఘన విజయం – రణధీర్ గెలుపు పట్ల శ్రీశైలం మండల నేతల హర్షం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ శ్రీశైలం రిపోర్టర్ ఎస్ జేమ్స్
కె.ఆత్మకూరు పట్టణంలోని గరీబ్ నగర్ 23వ వార్డులో సీపీఎం పార్టీ ఘన విజయం సాధించింది.సీపీఎం అభ్యర్థి ఆకుతోట రణధీర్ 360 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఈ సందర్భంగా శ్రీశైలం మండల సీపీఎం పార్టీ అధ్యక్షులు మునిపాటి చిన్న మారెన్న మాట్లాడుతూ
గరీబ్ నగర్ 23వ వార్డు ప్రజలు మాపై చూపిన అభిమానానికి,నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు.ఇది కేవలం రణధీర్ గెలుపు కాదు,పేద ప్రజల గెలుపు. మాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి పాదాభివందనం.
వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం,వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం అని అన్నారు.
అలాగే గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు సీఐటీయూ మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు,సిపిఎం శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జున లు కృతజ్ఞతలు తెలిపారు.