పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 04 2026: పెద్దమందడి మండలం, మణిగిల్ల గ్రామానికి చెందిన గర్రెమోని రాములు అనారోగ్య సమస్యతో బాధపడుతూ నిన్న అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుడి నివాసానికి చేరుకున్న సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, గర్రెమోని రాములు పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా అశ్రునివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా దహన సంస్కారాల నిమిత్తం రూ.4,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, భవిష్యత్తులో కూడా తమవంతు అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎస్. రాములు, పోతుల రాంరెడ్డి, జి. బాలరాజు, ఎస్. వెంకటయ్య, శ్రీకాంత్ రెడ్డి, కోములయ్య, ఎస్. మల్లికార్జున్, కుమ్మరి బుచ్చయ్య, ఆనంద్ రెడ్డి, మందడి శ్రీనివాస్, బోయిన్ కృష్ణ, బంధయ్య, బోడి గణేష్, అశోక్ రెడ్డి, సాయికుమార్, కసింగర్ రాజు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.