పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి మే 20 2026: రావూరి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని పువ్వాడ నగర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్స్ లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గ్రామ సర్పంచ్ షేక్ సిద్దిక్ గమనించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ విద్యా సంవత్సరానికి గాను రూ.2 లక్షలు మంజూరు చేయగా, బుధవారం టాయిలెట్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ సిద్దిక్ మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థుల అవసరాలను గుర్తించి టాయిలెట్స్ మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనుల ప్రారంభ సందర్భంగా సర్పంచ్ షేక్ సిద్దిక్‌తో పాటు రాములు, రాజు తదితరులు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.