POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 7:59 pm Posted by : POLITICAL POWER

గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల తో ఎల్ నినో నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, సభ్యుల భేటీ 

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టిని సారించాలి – గవర్నర్ శుక్ల

దేశ వ్యాప్తంగా పప్పు దినుసుల కొరత భారీగా ఉంది – గవర్నర్ శుక్ల 

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు సంతృప్తికరంగా ఉంది – గవర్నర్ శుక్ల

గవర్నర్ శుక్ల కు నిపుణుల కమిటీ రిపోర్ట్ అందజేసిన చైర్మన్ చిన్నారెడ్డి సభ్యులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 01 2026: దేశ వ్యాప్తంగా పప్పు దినుసులు, వంటి నూనె సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్య నుంచి అధిగమించేందుకు పప్పు దినుసులు, పామాయిల్ ఉత్పత్తులపై దృష్టిని సారించాలని,ఆ పంటల సాగుపై కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. శనివారం లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ఎల్ నినో ప్రభావంపై నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా భేటీ అయ్యారు.

ఈ సందర్బంగా ఎల్ నినో ప్రభావంపై నిపుణుల కమిటీ రూపోందించిన రిపోర్ట్ ను వారు గవర్నర్ కు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల వారితో వ్యవసాయం, దాని అనుబంధ అంశాలపై చర్చించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉండటం వల్ల పలు అంశాలపై గవర్నర్ తన అభిప్రాయాలను నిపుణుల కమిటీ బృందంతో పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా పప్పు దినుసుల కొరత తీవ్రంగా ఉండడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని గవర్నర్ అన్నారు. పప్పు దినుసుల దిగుమతి కోసం సుమారు రూ. 34, 054 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. వంట నూనె కొరత కూడా దేశంలో పెద్ద ఎత్తున ఉందని, అందుకోసం ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని గవర్నర్ అన్నారు. అయితే రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు సంతృప్తికరంగా ఉందన్నారు. దేశ అవసరాల కోసం ప్రతి సంవత్సరం సుమారు ఒక లక్ష 61 వేల కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి వంట నూనెను దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందని గవర్నర్ శుక్ల పేర్కొన్నారు. పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు వల్ల రాష్టంతో పాటు దేశంలో వాటి కొరత నుంచి బయట పడవచ్చు అని గవర్నర్ శుక్ల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హార్టికల్చర్ అభివృద్ధిపై, కూరగాయల సాగుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలని గవర్నర్ సూచించారు. ఎల్ నినో ప్రభావం నుంచి నిలదొక్కుకునేందుకు నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు బాగున్నాయని, నిపుణుల కమిటీ రిపోర్టు వివరంగా ఉందని కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారిని, సభ్యులను గవర్నర్ శుక్ల గారు అభినందించారు..