గాంధీ ఆసుపత్రిలో పేద రోగుల ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలి – డప్పు మల్లికార్జున్ మాదిగ.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎం.ఆర్.పి.ఎస్ హైదరాబాద్ జిల్లా నాయకులు డప్పు మల్లికార్జున్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సి ఎల్ ఆపరేషన్ కోసం నాలుగు నెలలుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న పేద రోగులకు, అవసరమైన ఇంప్లాంట్లు,పరికరాలు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పడం విచారకరమని అన్నారు. గర్భిణీ స్త్రీలు, అత్యవసర...