POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 6:56 pm Posted by : POLITICAL POWER

గార్లలో అమృత భౌతికకాయానికి నివాళులర్పించిన సర్పంచ్ షేక్ సిద్దిక్, లలితా రవి దంపతులు  * బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. తగిన న్యాయం చేస్తామని హామీ కుటుంబానికి తీరని లోటు అని నాయకుల దిగ్భ్రాంతి

ఖమ్మం / పాలేరు   నామ రాజేష్ కుమార్ (పొలిటికల్ పవర్ ):

పాలేరు నియోజకవర్గం ఎదూలాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన పువ్వాడ ఉదయ్ నగర్ (5వ బ్లాక్) నివాసి అమృత మృతి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

బుధవారం అమృత స్వగ్రామమైన గార్ల మండల పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చేరుకున్న పువ్వాడ ఉదయ్ నగర్ సర్పంచ్ షేక్ సిద్దిక్, మాజీ సర్పంచ్ కాంపటి లలితా-రవి దంపతులు అమృత పార్థివదేహానికి పూలమాలలు వేసి అశ్రునయనాల మధ్య ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన అమృత భర్తను పరామర్శించి, ప్రమాద శైలిని, వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చిన నాయకులు, “ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలి.. మీకు చట్టపరంగా, ప్రభుత్వ పరంగా తగిన న్యాయం జరిగేలా చూసే బాధ్యత మాది” అని స్పష్టం చేశారు.

ఈ నివాళులర్పించిన వారిలో సీనియర్ నాయకులు కాంపటి రాంబాబు, పోలిపాంగు నాగేశ్వరరావు, కిషన్, గుర్రం మనోజ్ తదితరులు పాల్గొని అమృత ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.