గార్లలో అమృత భౌతికకాయానికి నివాళులర్పించిన సర్పంచ్ షేక్ సిద్దిక్, లలితా రవి దంపతులు * బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. తగిన న్యాయం చేస్తామని హామీ కుటుంబానికి తీరని లోటు అని నాయకుల దిగ్భ్రాంతి
ఖమ్మం / పాలేరు నామ రాజేష్ కుమార్ (పొలిటికల్ పవర్ ): పాలేరు నియోజకవర్గం ఎదూలాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన పువ్వాడ ఉదయ్ నగర్ (5వ బ్లాక్) నివాసి అమృత మృతి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం అమృత స్వగ్రామమైన గార్ల మండల పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చేరుకున్న పువ్వాడ ఉదయ్ నగర్ సర్పంచ్ షేక్ సిద్దిక్, మాజీ సర్పంచ్ కాంపటి...