POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 2:40 pm Posted by : POLITICAL POWER

గిరిజన బిడ్డ శిరీష మరణ ఘటనపై పై అసెంబ్లీలో జారే ఆదినారాయణ ప్రస్తావన

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9 టీవీ న్యూస్ఆర్సికారం వెంకటేష్ సెప్టెంబర్:*

ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామనికి చెందిన ఊకె శిరీష మృతికి కారణమైన వ్యక్తులను వెంటనే

ఎన్కౌంటర్ చేయాలని ఈరోజు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఊకె శిరీష ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉద్యోగాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్తున్న మహిళలు యువతుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలకు ఎక్కడైనా భద్రత కల్పించే విధంగా రక్షణ చర్యలను బలోపేతం చేయాలని అన్నారు శిరీషపై జరిగిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు

మహిళలపై దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులకు వేగంగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు.

ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల మహిళల భద్రతపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. మహిళల భద్రత విషయంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.మహిళల రక్షణ భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.