గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలి: మద్దిశెట్టి సామేలు

మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో 6 వేల మంది పూజారులతో భారీ బహిరంగ సభ పొలిటికల్ పవర్ సెప్టెంబర్,19:తెలంగాణ: గిరిజన శివశక్తుల పూజారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మద్దిశెట్టి శామ్యూల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,000 మంది గిరిజన శివశక్తుల పూజారులతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా సంప్రదాయ పూజా విధానాలను కొనసాగిస్తూ, గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న శివశక్తుల పూజారులకు ప్రభుత్వపరంగా తగిన గుర్తింపు, సంక్షేమం అందాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు....