POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 5:44 pm Posted by : POLITICAL POWER

గుబ్బగుర్తిలో ‘రైతు ఆశీర్వాద సభ’ సన్నాహక సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి కొణిజర్ల (​గుబ్బగుర్తి) జూన్ 27: వ్యవసాయ అభివృద్ధి, రైతు ఆశీర్వాదం మరియు రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ను విజయవంతం చేయడం కోసం శనివారం రోజు గుబ్బగుర్తి గ్రామంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ​ఈ సమావేశానికి చుట్టుపక్కల ఐదు పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, ఉపసర్పంచులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే సభకు రైతులను ఏ విధంగా సమీకరించాలి, సభను ఎలా విజయవంతం చేయాలి అనే అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ​ముఖ్య అతిథులుగా వడ్డే నారాయణ, సూరంపల్లి రామారావు ​ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా వడ్డే నారాయణ మరియు సూరంపల్లి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసమే ఈనెల 30న రైతు ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదు పంచాయతీల పరిధిలోని రైతులందరూ ఈ మహాసభకు తరలివచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ​గ్రామ సర్పంచ్ దంతల ప్రశాంతి – నరసింహారావు మాట్లాడుతూ… అందరూ సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు.