నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.5 సెప్టెంబర్ 2026.
రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ విశ్వనాథ్ మహాదేన్ యోగ గురువుకు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి సి జి ఓ టవర్స్ కవాడిగూడ, సికింద్రాబాద్ ల ఉత్తమ యోగ గురువుగా సన్మానించడం జరిగింది. 2026 యోగ శిక్షణలో, యోగాలో మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవం లో విశేష సేవలు అందించిన వారికి తెలంగాణ రాష్ట్రంలో యోగాలో యోగ సర్టిఫికేషన్ బోర్డు ద్వారా మరియు అసిస్టెంట్ యోగ టీచర్లను, ఎందరో విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ మరియు ఉపాధి కల్పన చేసినందుకు, విశిష్ట సేవలు అందించిన వారికి ఈ సన్మానం చేయడం జరిగింది. ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని మరియు సమాజంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్యాన్ని యోగ మరియు ఆయుర్వేదం ద్వారా కాపాడుకోవచ్చని తద్వారా సమాజంలో ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగాలో విశిష్ట సేవలు అందించిన వారికి సన్మానం చేసి, అభినందనలు తెలియజేశారు.