POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 5:18 pm Posted by : POLITICAL POWER

గురు పౌర్ణమి సందర్భంగా ఇటుకూరి వీరయ్య గుప్త కు ఘనంగా సన్మానం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30.2026.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఆర్యవైశ్య మహాసభ మాజీ జిల్లా అధ్యక్షులు ఇటుకూరి వీరయ్య గుప్త కి ఆర్యవైశ్య మహాసభ వనపర్తి జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి,శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం మాజీ డైరెక్టర్,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత, శిశు మందిరం మాజీ ప్రధాన ఆచార్యులు  ప్రస్తుత రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ కార్యవర్గ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించి గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బాదం మాట్లాడుతూ ఇటుకూరి వీరయ్య గుప్తా ఆర్యవైశ్య సంఘాలలో సుదీర్ఘ ప్రస్తావనం ప్రయాణించి వివిధ హోదాలు బాధ్యతలు నిర్వహించి ఆర్యవైశ్య సమాజానికి సేవలందించారని గుర్తు చేశారు.ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఉన్న సందర్భంలో నిరుపేద ఆర్యవైశ్యుల నిమిత్తం ఒక వాసవి విద్యా ట్రస్ట్ ఏర్పాటుకు రూప కల్పన చేసి రూప శిల్పిగా ట్రస్ట్ ఏర్పాటుకు వారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ ఇటుకూరి వీరయ్య గుప్తా  నాకు ఆర్యవైశ్య సంఘంలో గురువు అని వారు నన్ను ఆర్యవైశ్య సంఘంలో పట్టణ స్థాయి నుండి..రాష్ట్ర ఆర్యవైశ్య సంఘంలో వివిధ బాధ్యతలు ఇప్పించి సంఘం పట్ల పూర్తి అవగాహన కల్పించి  సేవ చేసే భాగ్యం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి వీరయ్య గుప్త గారని తెలుపుటకు సంతోషపడుతూ గురుపూజ దినోత్సవం సందర్భంగా సన్మానం చేసే భాగ్యం అవకాశం వచ్చినందుకు ఆ భగవంతునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గురువులందరికీ గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లాకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు నరసింహయ్య, సంకిరెడ్డిపల్లిశ్రీనివాసులు,వనపర్తికి చెందిన వెంకటేష్ పాల్గొన్నారు.