POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 3:59 pm Posted by : POLITICAL POWER

గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి

తల్లిదండ్రులకు మండల విద్యాధికారి విజ్ఞప్తి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 04 2026: పెద్దమందడి మండలం రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని పెద్దమందడి మండల విద్యాధికారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ప్రైవేట్ పాఠశాలల హంగు ఆర్భాటాలు, ప్రచారాలను చూసి మోసపోవద్దని సూచించారు. విద్యార్థులను చేర్పించే ముందు ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తే, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు విద్యాశాఖ ఎలాంటి బాధ్యత వహించదని స్పష్టం చేశారు. అందువల్ల తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి పెద్దమందడి మండలంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు మండల విద్యాధికారి తెలిపారు.

ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్న పాఠశాలలు:

ప్రాథమిక పాఠశాల – గట్ల ఖానాపూర్ప్రా, థమిక పాఠశాల – మోజెర్ల, యూపీఎస్ – అమ్మపల్లి, ప్రాథమిక పాఠశాల – పెద్దమందడి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మండల విద్యాధికారి పిలుపునిచ్చారు.