గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి వెల్టూరు గ్రామ సమీపంలోని ఎన్‌హెచ్‌-44 రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలిజపల్లి గ్రామానికి చెందిన కొంగల రవి (50), తండ్రి రాములు, రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దమందడి ఎస్‌ఐ పి. జలంధర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను పరిశీలించారు....