POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 9:46 pm Posted by : POLITICAL POWER

గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మొక్కజొన్న పంట దగ్ధం సుమారు రెండు లక్షల పంట నష్టం…


గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో మొక్కజొన్న పంట దగ్ధం సుమారు రెండు లక్షల పంట నష్టం…

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో…

 

సాలుర మండలం ఖాజాపూర్ గ్రామంలో చేతికొచ్చిన పంట సుమారు నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట గుర్తుతెలియని వ్యక్తుల చేసిన పాపానికి తీవ్ర పంట నష్టం జరిగింది. ఖాజాపూర్ గ్రామానికి చెందిన చిద్రపు వెంకటేష్ కు చెందిన మొక్కజొన్న పంట, బుధవారం కోసి కుప్ప వేసిన క్రమంలో మరుసటి రోజు మిషన్ వచ్చి పట్టించే సమయంకు రెండు గంటల ముందులో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దానికి నిప్పంటించడంతో నోటి కాడికి వచ్చిన ముద్దని తగలబెట్టినట్టుగా కుప్ప మొత్తం కాలిపోయి సుమారు నాలుగు ఎకరాలకు సంబంధించిన పంట మొత్తం ఖాళీ బూడిదయ్యింది. రైతు వెంకటేష్ మాట్లాడుతూ ఇంకో రెండు గంటల్లో మిషన్ తో పట్టించుకుంటం అనుకున్న పంట కు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమైందని వాపోయారు. సుమారు రెండు లక్షల రూపాయల పంట నష్టం జరిగిందని ప్రభుత్వ అధికారులు తక్షణమే , జరిగిన నష్టాన్ని పరిశీలించి రైతుని ఆదుకోవాలని, ప్రభుత్వానికి కోరారు.