POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:54 pm Posted by : POLITICAL POWER

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య పురస్కారం

మర్రికంటి నరసింహ్మ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: వనపర్తి తన కవిత్వం ద్వారా తెలుగువారిని చైతన్యవంతం చేసిన మహాకవి గుర్రం జాషువా అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్.ఎన్.ఆర్ బ్యాంకెట్ హాల్ లో గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కోయి కోటేశ్వర్ రావు హాజరవుతారని, ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆత్మీయ అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణానికి చెందిన ప్రముఖ వచన కవి మరికంటి నరసింహ కు “గుర్రం జాషువా సాహిత్య పురస్కారం” అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాషువా సాహిత్యం నేటి యువతకు ఆదర్శమని, ఆయన రచనల్లోని సామాజిక చైతన్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందని శంకర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.