గుర్వాయిగూడెంలో టర్నడో బీభత్సం.. పంట తోటలు నేలమట్టం!
మామిడి, జీడి, పామాయిల్, పత్తి పంటలకు తీవ్ర నష్టం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధిలోని గుర్వాయిగూడెం గ్రామంలో టర్నడో బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా వీచిన బలమైన గాలులు, టర్నడో ప్రభావంతో గ్రామ పరిసర ప్రాంతాల్లోని పంట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి, జీడి, పామాయిల్ తోటలతో పాటు పత్తి పంటకు కూడా భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులకు పలుచోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. మామిడి, జీడి తోటల్లో...