గొల్లలమామిడాడలో కొవ్వూరి బసివి రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా దొరబాబు కృషితో బసివి రెడ్డి సేవలకు చిరస్మరణీయ గుర్తింపు
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే11: అపర దానకర్ణుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తిశేషులు కొవ్వూరి బసివి రెడ్డి కాంస్య విగ్రహాన్ని గొల్లలమామిడాడ గ్రామంలో యువ నాయకుడు చింతా దొరబాబు ఆధ్వర్యంలో సోమవారం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బసివి రెడ్డి సేవలను స్మరించుకున్నారు. సామాజిక సేవ, దాతృత్వం, ప్రజల పట్ల అపారమైన ప్రేమతో జీవించిన బసివి రెడ్డి చేసిన సేవలను నేటి తరాలకు...