POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 5:37 pm Posted by : POLITICAL POWER

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

-పలుస శంకర్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22,2026: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిందని, పట్టభద్రులందరూ ఓటు నమోదుకు సిద్ధం కావాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ మరియు వరంగల్ – ఖమ్మం – నల్గొండ స్థానాలకు మార్చి 2027 లో ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల కోసం నూతన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించిందని తెలిపారు. అతి ముఖ్య గమనిక: గతంలో ఓటు ఉన్నవారు కూడా ఈసారి తప్పనిసరిగా మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన ప్రతి పట్టభద్రుడు అర్హుడని, తమ డిగ్రీ సర్టిఫికేట్ తో తమ చదువుకు సార్థకత చేకూర్చే సమయం ఇదేనని అన్నారు. డిగ్రీ చదివిన ప్రతి యువతీ యువకుడు, ఉద్యోగి, నిరుద్యోగి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని కోరారు.

ముఖ్య తేదీలు:

– నోటిఫికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 28, 2026 నుండి

– ఫారం-18 ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 6, 2026

దరఖాస్తు విధానం:

ఆన్ లైన్ లో http://ceotelangana.nic.in వెబ్ సైట్ ద్వారా మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో మీ దగ్గరలోని RDO, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ఫారం సమర్పించవచ్చు. కావలసిన పత్రాలు: డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం, పాస్ పోర్ట్ ఫోటో, ఆధార్ కాపీ. మీ ఒక్క ఓటు విద్యావ్యవస్థలో మార్పుకు, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గొంతుక అవుతుందని, ఇది సాధారణ ఎన్నిక కాదని, పట్టభద్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్నిక అని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. అందరూ తమ బాధ్యతను నిర్వర్తించి ఓటరుగా నమోదు కావాలని, ఈ సమాచారాన్ని మిత్రులకు, బంధువులకు, గ్రూపులలో షేర్ చేయాలని శంకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయాలని శంకర్ గౌడ్ సూచించారు.