POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 8:23 pm Posted by : POLITICAL POWER

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం

కలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎన్ ప్రసాద్ రావు కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి విస్తరించడంతో పాటు, రైతులు పెద్ద సంఖ్యలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించేందుకు కలసపాడు, కాసినయన మండలాల పాయింట్ పర్సన్ లకు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి మండలంలో బీఆర్‌సీలను ఏర్పాటు చేసి, మండలస్థాయి నుంచి గ్రామస్థాయికి ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్స్‌ సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ ఐక్య సంఘం నుంచి ఎస్‌హెచ్‌జీలో సభ్యురాలిగా ఉండి వ్యవసాయం చేస్తున్న ఒక రైతును గుర్తించి పాయింట్‌ పర్సన్‌గా ఎంపిక చేశారు.
ఎంపికైన పాయింట్‌ పర్సన్‌లకు ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, వాటి వినియోగం, రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు అవసరమైన ఇన్‌పుట్స్‌ సకాలంలో అందుబాటులో ఉండేలా పాయింట్‌ పర్సన్‌లు సమన్వయం చేసుకోవాలని శిక్షణలో సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ, మరింత మంది రైతులను ఈ విధానంలోకి తీసుకురావడంలో పాయింట్‌ పర్సన్‌లు కీలకపాత్ర పోషించాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌సీ ఓనర్లు లక్ష్మి, రాధా, మాబున్ని, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎఫ్‌ఎంటీలు శ్రీలక్ష్మి, సంజీవరెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పాయింట్‌ పర్సన్‌లకు అవసరమైన అవగాహన కల్పించారు.