పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సాధికారత, రైతులకు అవసరమైన సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం రూ. 9.12 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
మంజూరైన నిధుల వివరాలు 10 గ్రామపంచాయతీ (GP) భవనాలు, ఒక్కో భవనానికి రూ. 20 లక్షలు, మొత్తం రూ. 2.00 కోట్లు
11 అంగన్‌వాడీ కేంద్రాలు, ఒక్కో కేంద్రానికి రూ. 12 లక్షలు, మొత్తం రూ. 1.32 కోట్లు, 30 విలేజ్ ఆర్గనైజేషన్ (VO) భవనాలు ఒక్కో భవనానికి రూ. 10 లక్షలు, మొత్తం రూ. 3.00 కోట్లు, 8 వ్యవసాయ గిడ్డంగులు (స్టోరేజ్ గోదాంలు) ఒక్కో గిడ్డంగికి రూ. 30 లక్షలు, మొత్తం రూ. 2.40 కోట్లు
మహిళా శక్తి భవనం రూ. 20 లక్షలు 2 వర్క్ షెడ్ భవనాలు, ఒక్కో భవనానికి రూ. 10 లక్షలు, మొత్తం రూ. 20 లక్షలు మొత్తం మంజూరైన నిధులు రూ. 9,12,00,000/- (తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల రూపాయలు) ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు మహిళా సంఘాలకు, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల రూపురేఖలు మార్చడం, మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడం, రైతులకు నిల్వ సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.