గత నెలలో సమస్యలపై డిమాండ్ వినతిపత్రం.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి. రవికుమార్.
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 08 2026: గ్రామంలో దీర్ఘకాలిక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో స్థానిక గ్రామపంచాయితీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి. రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిర్మలాయపల్లి గ్రామంలోని సోమవారము రోజు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో గత నెలలో 8వ వార్డులో వెంటనే డ్రైనేజీ, సీసీ రోడ్ల లేకపోవడం, పిచ్చిమొక్కలు, కంప చెట్లు పెరిగిపోయాయని దోమల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామ సభలో మండల స్పెషల్ ఆఫీసర్ ఎండి. సిరాజుద్దీన్ కు మరియు ఇన్చార్జ్ కార్యదర్శి రవికుమార్ కు గత గ్రామ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీ ఆర్ పి అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ… గతంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్థుల సమక్షంలో స్వయంగా వినతిపత్రం సమర్పించినప్పటికీ, నేటికీ కనీస చర్యలు తీసుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. 8వ వార్డులో నరకం మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో, మురుగునీరంతా ఇళ్ల మధ్య నిలిచి రోగాలకు కారణమవుతోందని, వెంటనే డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య లోపంతో దోమల ఉధృతి ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలు, కంప చెట్లు పెరిగిపోయాయని, దోమల నివారణకు పనులు చర్యలు చేపట్టాలని గ్రామంలో అనేక సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఫాగింగ్, బ్లీచింగ్ పనులు చేపట్టాలన్నారు. గ్రామస్థుల రక్షణ కోసం కీలక గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ నిఘా ఉంచాలని కోరారు. విద్యార్థుల కోసం గ్రామంలో లైబ్రరీ (గ్రంథాలయం) ఏర్పాటు చేయాలని మరియు ప్రజల ఆరోగ్యం కొరకు ఉచిత వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్స్) నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతురాజు రాములు, ఉప సర్పంచ్ రాజు,గ్రామ నాయకులు, వార్డ్ నెంబర్లు, యువత మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.