ఘట్‌కేసర్ విజయపురి కాలనీలో కోతుల సైన్యం కట్టడి కావలెను! – అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. లేదంటే ప్రజల భద్రతకే ముప్పు!
(పొలిటికల్ పవర్ - ఘట్‌కేసర్ ప్రత్యేక ప్రతినిధి): ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకుల, అధికారుల ఉదాసీనత ఏ స్థాయిలో ఉందో ఘట్‌కేసర్ విజయపురి కాలనీ పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. నిత్యం వందలాది నివాసాలతో కళకళలాడే విజయపురి కాలనీ ఇప్పుడు కోతుల మూకల కబ్జాలో బందీగా మారింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో కోతుల బెడద తీవ్రస్థాయికి చేరినప్పటికీ, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా విజయపురి కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకులు ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ...