1200 మంది మహిళలకు ఉచితంగా పట్టుచీరలు పంపిణీ చేసిన కంబాల…
తంటికొండలో కాంపౌండ్ వాల్, షేడ్ ను ప్రారంభించిన కంబాల
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / యన్ వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ జులై 30 2026: జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం తంటికొండ, గాదెలపాలెం గ్రామాలలో మంగళవారం రాత్రి నిర్వహించిన ‘కంబాల కానుక వనితల వేడుక’ పట్టుచీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలిత తంటికొండ గ్రామంలో కంబాల శ్రీనివాసరావు అందజేసిన రూ.2 లక్షలు విరాళంతో సత్సంగం భవనం వద్ద నూతనంగా నిర్మించిన కాంపౌండ్ వాల్, షేడ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయనకు ఆయా గ్రామాల మహిళలు హరతులతో స్వాగతం పలికారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువత అభిమానులు ఘన స్వాగతం పలికి, పూలమాలతో సత్కరించారు. గ్రామాలలోని ఆలయాలను దర్శించుకుని, పూజలు నిర్వహించి, గ్రామ దేవతలకు తొలి చీరలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాలలో మహిళల నుంచి విశేషా స్పందన లభించింది. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు తంటికొండ గ్రామంలో 850 మంది మహిళలకు, గాదెలపాలెం గ్రామంలో 350 మంది మహిళలకు ఉచితంగా పట్టుచీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.