Date of Publish : 02 June 2026, 3:07 pmPosted by : POLITICAL POWER
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
అమరవీరుల త్యాగాలు, సోనియా గాంధీ సహకారంతోనే స్వరాష్ట్ర కలను సాధించాం.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది.
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: నాగర్ కర్నూల్ జిల్లా పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర 13 వ అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అమరవీరులకు ఈ వేడుకలు అంకితమని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమైన రోజు అని అన్నారు. అనేక సంవత్సరాల ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకోవాలి అని అన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైతులు, మహిళలు, యువత మరియు విద్యార్థుల అభ్యున్నతే తెలంగాణ అభివృద్ధికి పునాది అని తెలిపారు. యువత తెలంగాణ భవిష్యత్తుకు శక్తివంతమైన వారసులు కాబట్టి మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, వివిధ శాఖలలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం చేసిన సంక్షేమాలను గణాంకాలతో చిన్నారెడ్డి క్లుప్తంగా వివరించారు. విద్య, ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మన ప్రత్యేక గుర్తింపు వాటిని కాపాడుతూ భావితరాలకు అందించడం మన అందరి బాధ్యత అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజా ప్రభుత్వంముందుకు సాగుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతలపై విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి,నాగర్ కర్నూల్ ఎస్పీపాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపత్రావ్, నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు, జిల్లా ప్రజలు, వనపర్తి మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, ఎంట్ల రవి, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.