ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్, వనపర్తి జిల్లా బ్యూరో, జూన్ 2, 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులను స్మరించారు. కార్యక్రమంలో మాట్లాడిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాల...