POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 7:46 pm Posted by : POLITICAL POWER

ఘనంగా మెకానిక్ ల దినోత్సవ వేడుకలు 

పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా పట్టణంలోని ద్విచక్ర వాహన మెకానిక్ సత్తుపల్లి మోటర్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు భాస్కర, కార్యదర్శుల బాజీ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. అనంతరం కేక్ కట్ చేసి,మిఠాయిలు పంపిణీ చేసుకొని ఒకరికొకరు మెకానిక్ లు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరం ఏకతాటిపై ఉండి సమస్యలను పరిష్కరించుకుందామని, ప్రజా ప్రతినిధుల అండదండలతో ఆటోనగర్ ఏర్పాటు చేసుకుందామని, తారతమ్యాలు లేకుండా ఏకతాటిపై మన యూనియన్ నడుపుకుందామని వివరించారు. ఈ కార్యక్రమంలో హకీమ్, శ్రీను, ప్రసాద్, మురళి, శివ, మీరా, రవి, ముస్తఫా, శ్రీకాంత్, అజార్, కమల్ నాయక్,శేఖర్, రామ కృష్ణ, రహీం, చక్రి, నభి, సాయి, అబ్దుల్లా, పూరేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.