POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 7:53 pm Posted by : POLITICAL POWER

ఘనంగా రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్ష ప్రసారం

మండలంలోని 3 రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం

అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మరియు రైతులు

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్) జూలై 10: తొమ్మిది రోజులలో 9 వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో రైతు ఆశీర్వాద సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజులలో 9 వేల కోట్లు నిధులు రైతుల ఖాతాలో విడుదలా చేయడం సంతోషంగా ఉంది అని తెలియజేశారు. మిగిలిన రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసా నిధులు విడుదల చేసారు. కాంగ్రెస్ వచ్చిన 30 నెలలలో రైతులకు వివిధ పధకాల (రైతు భరోసా, రైతు భీమా, రైతు రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంటు వరికి బోనస్ మరియు పంట నష్ట పరిహారం) ద్వారా లక్ష కోట్లు ఇచ్చినట్లు తెలియజేసారు. ములకలపల్లి మండలంలోని ములకలపల్లి, పూసుగూడెం మరియు జగన్నాధపురం రైతు వేదికలో దృశ్య శ్రవణ మాధ్యమం ( వీడియో కాన్ఫరెన్స్) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మండల వ్యవసాయ అధికారి బి అరుణ్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారుర్లు సుజాత, రాహుల్, సూరిబాబు, రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జహీర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు పెటేటి నర్సింహారావు, సొసైటీ మాజీ చైర్మన్ కరుటూరి కృష్ణ, తిరుపతి రెడ్డి, శనగపటి రవి, రాజేష్, మిరియాల అవినాష్ మరియు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.