POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 9:46 pm Posted by : POLITICAL POWER

ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

– గోపిక, చిన్ని కృష్ణుడు వేషధారణలతో అలరించిన చిన్నారులు,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్.05.2026. శ్రీకృష్ణాష్టమి రోజు చిన్న పిల్లల సందడి అంతా ఇంత కాదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్లు. తమబిడ్డలనుకన్నయ్యలా అలంకరించి మురిసిపోతారు. పలు ప్రాంతాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్బంగా ఈ దృశ్యాలే కన్పించ్చాయి. కృష్ణుడి వేషధారణలో చిన్నారి బాల బాలికలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు.చిటిపొట్టి చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు కృష్ణుడు, గోపిలు, యశోద వంటి వేషధారణలతో కృష్ణాష్టమి సంబరాలను జరుపుకున్నారు. మగ పిల్లలకు కృష్ణుడి వేషం,ఆడపిల్లలనుగోపికలాతయారుచేసితల్లిదండ్రులు సంతోషించారు. కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ లో కూడా కృష్ణాష్టమి సంబరాలను నిర్వహించారు. తమ స్టూడెంట్స్ కు కృష్ణుడి గోపికలవేషాలువేసివేడుకలను జరిపారు.చిన్నారులు గోపిక, శ్రీకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు.