POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 5:18 pm Posted by : POLITICAL POWER

ఘనంగా సాయి ఎక్సలెంట్ స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్: ద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుమండలంలోని సాయి ఎక్సలెంట్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ఎక్సలెంట్ పాఠశాల విద్యార్థులు నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ అలరించారు. విద్యార్థినులు పాఠశాలలోని సోదరులకు రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. అనంతరం సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జక్కుల శివ కుమారి మాట్లాడుతూ.విద్యార్థులు సోదర భావాన్ని కలిగి ముందుకు కొనసాగాలని, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల అనుబంధం చాలా విలువైనదన్నారు. అదేవిధంగా విద్యార్థులు విద్యలో ముందుకు వెళుతూ ప్రతిభను సాధించి. పాఠశాలకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని కాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఆరెబోయిన కృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులు ఆరెబోయిన నాగలక్ష్మి, సత్యవతి, నభీన, అనిత, ఉదయభాను, కళ్యాణి, ప్రశాంతి, కళ్యాణి, స్వాతి, అరుణ, కృష్ణవేణి, శిరీష, పల్లవి, రిచిత, యామిని, మమత, రజిత, దుర్గ, కిరణ్మయి, సునీత, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.