ఘనంగా సాయి ఎక్సలెంట్ స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుమండలంలోని సాయి ఎక్సలెంట్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ఎక్సలెంట్ పాఠశాల విద్యార్థులు నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ అలరించారు. విద్యార్థినులు పాఠశాలలోని సోదరులకు రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. అనంతరం సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జక్కుల శివ కుమారి మాట్లాడుతూ.విద్యార్థులు సోదర భావాన్ని కలిగి ముందుకు కొనసాగాలని, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల అనుబంధం చాలా విలువైనదన్నారు....