POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:22 pm Posted by : POLITICAL POWER

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 15 2026: దేశం కోసం పోరాడిన మహనీయుల ధైర్యం, త్యాగం, దేశభక్తి మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని సోనుబాయ్ అన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారు కలలుగన్న సమానత్వం, ఐక్యత, అభివృద్ధి సాధించే దిశగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లాల్‌దర్వాజాలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నందాల అనిల్‌కుమార్, కట్టల శారద, సుచిత్ర, శ్రీ వాసు, కోమల్, రాజు, నితిన్ తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి స్ఫూర్తితో భారతదేశాన్ని మరింత బలమైన, సమృద్ధి చెందిన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వారు కోరారు.