చండ్రుగొండలో మెచ్చా మార్క్‌.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతన జోష్

కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసే వరకు కసిగా పనిచేయాలి: మెచ్చా. పొలిటికల్ పవర్, ఆగస్టు 26,చండ్రుగొండ:అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మెచ్చా నాగేశ్వరరావు చండ్రుగొండ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని నాయకులు తెలిపారు. ముందుగా అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మెచ్చా నాగేశ్వరరావు అనంతరం మద్దుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ దిమ్మను...