చంద్రబాబు అరాచకాలపై నిలదీసిన వైఎస్‌ జగన్‌! స్థానిక పోరులో అక్రమాల ఆవిష్కరణలను ప్రజలు గమనిస్తున్నారు!

తాడేపల్లి (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీ అరాచకాలకు అద్దం పడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాల నుంచి విచ్చేసిన పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికలు జరిగిన తీరు, తదనంతర రాజకీయ పరిణామాలపై క్షుణ్ణంగా చర్చించారు....