POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 5:54 pm Posted by : POLITICAL POWER

చంద్రబాబు సంపద సృష్టి*”

• పెట్రోల్ , డీజీల్ ,వాహన గ్యాస్ కూడా రెట్లు పెంచి సంపద సృష్టించారు.

• వంట నూనె లు నిత్యావసర వస్తువులకు సామాన్యులకు అందని రేట్లకు పెంచి సంపద సృష్టించారు.

• లిక్కర్ ఆదాయ బాండ్లు తాకట్టు పెట్టి అత్యధిక వడ్డీ రేటు 9.15 శాతానికి తాకట్టు పెట్టి రూ.5490 కోట్ల రుణం తీసుకొని సంపద సృష్టి.

• స్థలాల రిజిస్ట్రేషన్ల పై అధిక పన్నులు విధించి సంపద సృష్టించిన మీ కూటమి ప్రభుత్వం.

• మొట్టమొదటి సారిగా కనివిని ఎరుగని రీతిలో వాకర్స్ పై సంపద సృష్టిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్న మీ సంపద సృష్టి.

• ప్రజల సొమ్ములతో విహార యాత్రలకు లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మీ అమోఘమైన సంపద సృష్టి.

• సామాన్య ప్రజల పై అధిక రేట్ల భారాన్ని వేసి ప్రజల నడ్డి విరిచి ఇలా ఎన్ని సంపదలు సృష్టించిన మీరు సామాన్య ప్రజలకు ఏ సంక్షేమ పథకం అందించలేక ప్రభుత్వ ఖజానా లో సంపద లేదని సరికొత్త రికార్డు సృష్టించారు.

• మా జగనన్న ప్రభుత్వంలో అనేక సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికీ వాలెంటీర్ల ద్వారా చేరాయి.

• మీరు చేసిన రాష్ట్ర అప్పుల భారం 3,62,855 కోట్లకు చేరింది అయిన ప్రతి నెల 25,000 వేల పెన్షన్లను క్రమంగా తగ్గించి చరిత్ర సృష్టించారు.

• మీ కూటమి ప్రభుత్వం రెండు ఏళ్లు దాటిన కొత్త వారికి ఏ ఒక్క పెన్షన్ గానీ ,ఎటువంటి సంక్షేమ పథకం గానీ అమలు చెయ్యలేదు.

• మీ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర సిగ్గుపడి తలదించుకునేలా మీ పాలన ఉందని రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటున్నారు.

• ఇకనైన మా జగనన్న చేసిన పాలన ఒకసారి గుర్తుతెచ్చుకొని ఆయన బాటలో నడిచి ఆయన చేసిన ప్రజా పాలన కోసం ప్రయత్నించండి. లేకుంటే వచ్చే ఎన్నికలలో ప్రజల ఓటుతో కూటమి ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తారని హెచ్చరిస్తున్నము అని లోలుగు శేఖర్ అన్నారు