చదువుకోవడానికి పెన్నులు ఆకలి తీర్చడానికి బియ్యం పేదలకు భరోసానిచ్చిన వైటీపీఎస్ ఇంజనీర్లు

చదువుకోవడానికి పెన్నులు.. ఆకలి తీర్చడానికి బియ్యం.. పేదలకు భరోసానిచ్చిన వైటీపీఎస్ ఇంజనీర్లు! దామరచర్ల, పొలిటికల్న్యూస్ (పీఎన్9 టీవీ తెలుగు న్యూస్): "సమాజంలో మనతో పాటు ఉంటున్న పేదవారికి తోచిన సాయం చేయడం మన బాధ్యత" అని నిరూపించారు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ఇంజనీర్లు మరియు ఉద్యోగులు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఎస్సీ కాలనీలో నివసించే నిరుపేద కుటుంబాలు, విద్యార్థుల కష్టాలను గుర్తించి వారు మానవత్వాన్ని చాటుకున్నారు. సుమారు రూ.25,000 వ్యయంతో పేద కుటుంబాలకు బియ్యం సంచులు, బడి పిల్లలకు చదువుకునేందుకు...