POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 7:12 pm Posted by : POLITICAL POWER

చదువే ఆయుధంగా.. వైద్య సీటుతో భవాని సత్తా

–విద్యాకుసుమాలేవిద్యాపర్తికిమూలస్తంభాలు,అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ సతీష్‌ యాదవ్‌,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.27.2026.విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తి జిల్లాకు పేరు తెచ్చేలా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ సతీష్‌ యాదవ్‌ అన్నారు. కొత్తకోట పట్టణం ఐదో వార్డు కౌన్సిలర్‌ ముంత మంజుల రామకృష్ణ కుమార్తె ఎం. భవాని ఎంబీబీఎస్‌ సీటు సాధించిన సందర్భంగా డాక్టర్‌ సతీష్‌ యాదవ్‌ ఆమెను శాలువాతో కప్పి   ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను కొనలేమని, కష్టమనకుండా ఇష్టపడిచదివితేనేఉన్నతఫలితాలుసాధ్యమవుతాయన్నారు. సోషల్‌ మీడియా ఉచ్చులో పడి విద్యకు దూరమవుతున్నవిద్యార్థులుభవానివంటిప్రతిభావంతులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సినిమాలు, సెల్‌ఫోన్లు, మత్తుపదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టిసారించాలనికోరారు. భవానిని సన్మానించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ మంజుల రామక్రిష్ణ, మాజీ ఎంపీటీసీ సత్యం యాదవ్‌, ఆశన్న, తిరుపతయ్య, ఖాజా, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.