POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 5:45 pm Posted by : POLITICAL POWER

చలో ఇందిరా పార్క్ ఉద్యమ గర్జనను విజయవంతం చేయండి

తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 18వ తారీకు గురువారం రోజున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఉద్యమ మహా గర్జనను నిర్వహించుచున్నది. ఉద్యమ మహాగర్జన యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం, తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్స్ ను నెరవేర్చుకోవడం కోసం ధర్నా తలపెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇండ్ల స్థలం ఇవ్వాలి. 10 లక్షలతో నాలుగు గదుల ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. భారత స్వతంత్ర సమాన్ ఏ వన్ గ్రేడ్ కింద 50 వేల రూపాయల పెన్షన్స్ సౌకర్యం ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు 25 లక్షల ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలి. తెలంగాణ ఉద్యమ కారుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్యను అందజేయాలి. తెలంగాణ ఉద్యమకారుల పిల్లలు ఉద్యోగాలకు అర్హులు అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం,ఒక ప్రైవేటు ఉద్యోగం కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారులకు 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఉచిత బస్సు, ఉచిత రైలు సౌకర్యం కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ నిధికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి. తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సన్మానించాలి. తెలంగాణ ఉద్యమకారులను ఆగస్టు 15, స్వతంత్ర దినోత్సవ రోజున, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రత్యేకంగా ఆహ్వానించాలి అని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు.