పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి మండలం కొడంగల్‌లో నిర్వహిస్తున్న రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో మరియు భారీ బహిరంగ సభకు పెద్దమందడి మండలం పామి రెడ్డి పల్లి గ్రామం లోని రైతు సోదరులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు, డీసీసీ ఉపాధ్యక్షులు టీ. సాయి చరణ్ రెడ్డి సూచనలతో పామిరెడ్డిపల్లి గ్రామం నుండి రైతులు, నాయకులు సమిష్టిగా బయలుదేరారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మరియు మాజీ ఎంపిటిసి ఇందిరా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను తెలుసుకునేందుకు ఈ రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు వార్డు సభ్యులు, పద్మ వ్యవసాయ అధికారి మహేశ్వరి,మరియు మరియు నాయకులు, రాకాసి భీమ్ రెడ్డి నాగేంద్ర సాగర్ సందడి మన్యపు రెడ్డి ఎండి షౌకత్ నరసింహ వెంకటయ్య కార్యకర్తలు, రైతులు, పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

