POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 10:41 am Posted by : POLITICAL POWER

చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్ మృతి

 

– గత నెల 26న ప్రయాణీకురాలితో ఘర్షణ

– బస్సులో నుంచి ప్యాసింజర్ త్రోయడంతో టైర్ల కింద పడ్డ ప్రవళిక

బందు కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు

హైదరాబాదులోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళాకండక్టర్ ప్రవళిక (24) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత నెల 26వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన బాణోత్ మౌనిక అనే మహిళ.
కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసిన కండక్టర్ ప్రవళిక. తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, కండక్టర్ ప్రవల్లిక ను బస్సు నుంచి కిందకు త్రోసీన ప్యాసింజర్ మౌనిక. దీంతో ఆమె బస్సు వెనుక టైర్ల కింద పడి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఆమెకు చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. *కండక్టర్ ప్రవల్లిక మరణవార్త విన్న తర్వాత కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ప్రవళిక మృతిని నిరసిస్తూ బుధవారం ఖమ్మం రీజియన్లోని ఆర్టీసీ డిపోల్లో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి.ఇప్పటికే కండక్టర్ను బస్సు నుంచి తోసేసిన కేసులో ప్రయాణీకురాలు బాణోత్ మౌనికను అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. *అరెస్ట్ అయిన ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి , ప్రవల్లిక కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా తో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.